బీచ్ లో యువకుడు మృతి

బీచ్ లో యువకుడు మృతికృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్ లో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం స్నానాలకు ప్రజలు వచ్చారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన వంశీకృష్ణ (18) సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. స్థానిక కోడూరు ఎస్ఐ పి. రమేష్ ఘటనాస్థలికి చేరుకొని మెరైన్ పోలీసు వారి సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో వంశీకృష్ణ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో హంసలదీవి సాగర సంగమం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి.