కాంగ్రెస్ ఖాతాలో తొర్రూరు, జనగామ

కాంగ్రెస్ ఖాతాలో తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలు

 

కాంగ్రెస్ ఖాతాలో తొర్రూరు, జనగామవరంగల్ టైమ్స్, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉద్రిక్తతల మధ్య కొనసాగిన విషయం తెలిసిందే. సోమవారం 7 కార్పొరేషన్లకు, 105 మున్సిపాలిటీలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్విహించారు. కోరం లేకపోవడం, ప్రతిపక్ష పార్టీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి సమానంగా సీట్లు గెలవడం, ఇక ఇతర అనివార్య కారణాల వల్ల 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే వాయిదా పడిన ఎన్నిక మంగళవారం నిర్వహించారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అదృష్టం వరించింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లక్కీ డ్రా ద్వారా చైర్మన్లుగా ఎన్నికయ్యారు.కాంగ్రెస్ ఖాతాలో తొర్రూరు, జనగామమహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 స్థానాలు గెలుచుకున్నాయి., ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే తేజస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య రిజిస్టర్ చేసుకున్నారు. వారు ఓట్లు కూడా కలుపుకుని కాంగ్రెస్ బలం 9కి చేరింది. మంగళవారం ఎన్నిక నిర్వహించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమానంగా చెరో 9 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా ద్వారా చైర్మన్ ను ఎంపిక చేశారు. 2వ వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ డ్రాలో విజయం సాధించి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రిటర్నింగ్ అధికారులు అధికారిక పత్రం అందచేశారు.

ఇక జనగామ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికను నిర్వహించగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు వేసిన తర్వాత కూడా రెండు పార్టీలకు కూడా సమానంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి బాలమణికి మొత్తం 16 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి గోపగాని సుగుణాకర్ సైతం 16 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు డ్రా వేసి, ఇద్దరి పేర్లు తీశారు. లక్కీ డ్రాలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి కదకంచి బాలమణి పేరు రాడటంతో ఆమెను చైర్మన్ గా ప్రకటిస్తూ అధికారులు ద్రువీకరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆందోళన చేశారు. వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఖాతాలో తొర్రూరు, జనగామఇక డోర్నకల్, కాగజ్ నగర్, జహీరాబాద్, ఇల్లందు మున్సిపల్ పీఠాలను సైతం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇంద్రేశం, ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ ఖాతాలో చేరగా, ఇబ్రహీంపట్నం ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.