కాంగ్రెసోళ్లు కక్షగట్టి సస్పెండ్ చేయించినా..
కానిస్టేబుల్ భార్య బీఆర్ఎస్ అభ్యర్థిగా ఘన విజయం!
వరంగల్ టైమ్స్, సిద్ధిపేట జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలను తట్టుకొని.. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఘన విజయం సాధించింది గీతాంజలి రమేష్.సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గీతాంజలి భర్త కమలాపురం రమేశ్ బీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నాడంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఫిర్యాదు చేసి కక్షగట్టి సస్పెండ్ చేయించారు.కానీ, వార్డు ప్రజలు మాత్రం కానిస్టేబుల్ భార్య కమలాపురం గీతాంజలిని అక్కున చేర్చుకుని 223 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఓటర్లు మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఆదరించారు.














