మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్

-బాల్క సుమన్ నివాసం వద్ద ఉద్రిక్తత

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్వరంగల్ టైమ్స్, మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లిలోని బాల్క సుమన్ ను అరెస్టు చేయడానికి ఆయన నివాసానికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఎన్నిక జరుగకుండా అడుగడుగునా పోలీసుల సహకారంతో అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. దీంతో ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశాయి. గత రెండ్రోజులుగా బాల్క సుమన్ ఇంటిని ముట్టడించిన పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కల్గించారన్న ఆరోపణలతో బాల్క సుమన్ కు నోటీసులు అందచేశారు. అనంతరం బుధవారం అరెస్ట్ చేశారు

ఈ నేపథ్యంలో బాల్క సుమన్ రేవంత్ సర్కార్ పై పలు ఆరోపణలు చేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కుట్రతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. తమపై కాంగ్రెస్ నాయకులు రాళ్లు రువ్వడమే కాకుండా పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేసి, మళ్లీ కేసులు కూడా తమపైనే పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు.