అల్వాల్ లో హమారా ప్రసాద్ అరెస్ట్ 

అల్వాల్ లో హమారా ప్రసాద్ అరెస్ట్ వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. శుక్రవారం హైదరాబాద్ లోని అల్వాల్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో వివాదం చెలరేగింది. దీనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు ప్రసాద్ ను రిమాండ్ కు తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.