హైదరాబాద్‌లో భారీ వర్షం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: వేసవికాలం ఇంకా ప్రారంభం కాకముందే ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అకస్మాత్తుగా హైదరాబాద్ లో వర్షం కురిసింది. వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు చేసినట్టుగానే హైదరాబాద్ లో మధ్యాహ్నం పూట వర్షం కురిసింది. హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, ఉప్పల్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, అమీర్ పేట, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవ్వటంతో వాహనదారులు కొంత ఇబ్బందులు పడ్డారు. రానున్న రెండ్రోజుల్లో కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.













