కృష్ణాజిల్లాలో విషాదఛాయలు

కృష్ణాజిల్లాలో విషాదఛాయలు..దేశరక్షణ విధి నిర్వహణలో ఉన్న జవాను మృతికృష్ణాజిల్లాలో విషాదఛాయలుకృష్ణా జిల్లా : కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశరక్షణ విధి నిర్వహణలో ఉన్నఅవనిగడ్డ కు చెందిన షేక్.హాజి హుస్సేన్(28) (ఇండో టెబిటెన్ బోర్డర్ పోలీస్) గా విధులు నిర్వహిస్తూ ఉత్తరఖాండ్ లోని నీలం యూనిట్లో బుధవారం సాయంత్రం మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో హుస్సేన్​ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హుస్సేన్ కు వచ్చే మే నెలలో వివాహానికి కుటుంబ సభ్యులు నిశ్చయించారు. ఇంతలోనే ఈ చేదు ఘటన చోటు చేసుకోవడం వల్ల వారు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ నెల 2 వతేదీన తండ్రి షేక్ మహబూబ్( లారీ డ్రైవర్), తల్లి షకీలా భేగం లకు ఫోన్​ చేసి డిసెంబర్ 15 న మేనమామ వివాహానికి హాజరవుతునాని తెలిపారు. మోకాలు లోతు మంచులో ఉత్తరఖాండ్ నీలం యూనిట్​లో విధి నిర్వహణలో ఉన్నానని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.