అభిమాని కుమార్తె పెళ్లికి సాయం

అభిమాని కుమార్తె పెళ్లికి సాయంమహబూబాబాద్ జిల్లా: పేదింటి అభిమాని కుమార్తె పెళ్లికి లక్ష సాయం అందించి మెగస్టార్​ చిరంజీవి తన మంచి మనస్సును చాటుకున్నాడు. పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి పెట్టుకుని జీవనాన్ని సాగిస్తున్నాడు. గత 30 ఏళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా, రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటున్నాడు. శేఖర్ కు ఇద్దరు కూతుళ్లు వర్ష, నిఖిత. అయితే వీరి పేదరికాన్ని చిరంజీవి స్వయంగా తెలుసుకున్నాడు. డిసెంబర్ 19 న జరుగునున్న శేఖర్​ కూతురు వర్షపెళ్లికి 1,00,000/- ఆర్ధిక సాయం చేశారు. సంబంధిత చెక్కును బాధితుడికి ఎమ్మెల్యే శంకర్​నాయక్​ అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సహాయం చేయడం సంతోష కరమని , చిరంజీవిని ఆ దేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే కొనియాడారు. అభిమానులు ఎవరూ కష్టాల్లో ఉన్న చెప్పండి అని చిరంజీవి స్వయంగా తమతో చెప్పినట్టు రవణం స్వామి నాయుడు చెప్పారు.”రక్త సంబంధీకులు చేయని సహాయం చిరంజీవి చేసారు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనిది’ అని శేఖర్​ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్ నాయక్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈవో రవణం రావణస్వామి నాయుడు , కరాటే ప్రభాకర్​ , సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కే ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు మునిర్, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు