కేసీఆర్ కు హరీశ్ రావు పాదాభివందనం

కేసీఆర్ కు హరీశ్ రావు పాదాభివందనంసిద్దిపేట జిల్లా : సిద్ధిపేట పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సిద్దిపేటలో తన రాజకీయ జీవితం, పరిపాలన, ప్రజలు ఆదరించిన తీరుతో పాటు, సిద్దిపేటకు ఆణిముత్యంల్లాంటి నాయకుడిని ఇచ్చానని హరీశ్ రావు ను ఉద్దేశించి మాట్లాడారు కేసీఆర్. పలు సిద్దిపేటకు పలు వరాలు కురిపించారు. దీంతో ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు కడుపునిండినంత ఆనందంగా వుందని అన్నారు.
కేసీఆర్ కు హరీశ్ రావు పాదాభివందనంసిద్ధిపేట జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన పనులను ప్రారంభించామని చెప్పారు. ఇళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ ఆడబిడ్డలు ఆనందబాష్పాలు కారుస్తుంటే కడుపునిండినంత ఆనందం కలిగిందని, ఇదంతా సీఎం కేసీఆర్ చలువేనంటూ ఒక్కసారిగా ఆనందాన్ని దాచుకోలేక బహిరంగ సభావేదికపై కేసీఆర్ కు హరీశ్ రావు పాదాభివందనం చేశారు.కేసీఆర్ కు హరీశ్ రావు పాదాభివందనం