“కరోనాలో ఛాలెంజింగ్ రోల్ చేశా: దక్షి

"కరోనాలో ఛాలెంజింగ్ రోల్ చేశా: దక్షిహైదరాబాద్​: ఆర్జీవీ “కరోనా వైరస్” సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు దక్షి గుత్తికొండ. ఈ సినిమాలో నటించిన ఎక్స్ పీరియన్స్ ను దక్షి తెలిపింది. ‘సామాజిక మాధ్యమాల్లో ఉన్న నా గ్లామర్ ఇమేజ్ కి సినిమాలో చేసిన రోల్ కి అస్సలు సంబంధం ఉండదు. ఒక తెలుగు ఫ్యామిలీ లో తమిళ కోడలి గా వంశీ చాగంటి కి వైఫ్ గా కనిపిస్తాను. నా మొదటి సినిమాలోనే డీ గ్లామ్ క్యారెక్టర్ చేయండం ఛాలెంజింగ్ గా అనిపించింది. అనిదక్షి గుత్తికొండ తెలిపారు. ‘కరోనా టైం లో తెలుగమ్మాయి అయిన నాకు మొదటి సినిమాలో అవకాశం ఇచ్చిన రాంగోపాల్ వర్మ గారికి ధన్యవాదాలు. ఇలాంటి పాత్రలే చెయ్యాలని నాకంటూ పరిమితులేమి పెట్టుకోలేదు. ఒకవేళ కథ నచ్చితే ఏ తరహా పాత్ర అయినా పోషిస్తాను. అలాగే కథ డిమాండ్ చేస్తే గ్లామర్, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి కూడా సిద్దమే.” అని చెప్పింది దక్షి గుత్తికొండ."కరోనాలో ఛాలెంజింగ్ రోల్ చేశా: దక్షి