సమాజ సేవలో డ్రైవర్లుండటం అభినందనీయం

సమాజ సేవలో డ్రైవర్లుండటం అభినందనీయం

సమాజ సేవలో డ్రైవర్లుండటం అభినందనీయంవరంగల్ టైమ్స్,హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా ఓన్ ప్లేట్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఐడి కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతా రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాసరావు హాజరయ్యారు, యూనియన్ గౌరవాధ్యక్షులు శంకర్, యూనియన్ అధ్యక్షులు పల్లెర్ల యాకూబ్ అతిథులుగా పాల్గొని డ్రైవర్లకు ఐడి కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ సీతా రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని, ఈ వృత్తిలో సమయపాలనకు పరిమితులు ఉండవని తెలిపారు.

డ్రైవర్లు అందరూ క్రమశిక్షణతో తమ వృత్తిని కొనసాగిస్తూ, ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, అవసరమైన సమయంలో రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలలో డ్రైవర్ సంఘాలు ముందుండటం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డ్రైవర్ యూనియన్ కమిటీ సభ్యులు మరియు డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.