రేపు బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు

రేపు బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు

వరంగల్ టైమ్స్, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం సారా బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఇటీవల సారా తాగి తీవ్ర అస్వస్థతకు గురై 18 మంది గ్రామస్తులు మరణించారు. మరికొందరు సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి వారిని ఓదార్చడానికి గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు.రేపు బాధితులను పరామర్శించనున్న చంద్రబాబుమద్యనిషేదం దశలవారీగా విధిస్తామని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ ను, సారా తయారీని ప్రోత్సహించడం వల్లనే పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ఇటీవల జరుగుతున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని అన్నారు. కల్తీసారా కారణంగా బాధితులు చనిపోతున్నారని ఆరోపించారు. కల్తీసారాను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిలైందని విమర్శించారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.