సినిమా ఛాన్స్ కావాల..?

సినిమా ఛాన్స్ కావాల..?

నెక్ట్స్ ఫిల్మ్ కోసం సోష‌ల్ మీడియాలో లైవ్ ఆడిష‌న్ నిర్వ‌హించ‌నున్న డైరెక్ట‌ర్ తేజ‌. 

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : డైరెక్ట‌ర్ తేజ త‌న త‌ర్వాతి సినిమాతో ప్ర‌తిభావంతులైన న‌టుల‌ను ప‌రిచ‌యం చేయ‌నున్నారు. దీని కోసం టాలీవుడ్‌లోనే మొట్ట‌మొద‌టి సారిగా, సోష‌ల్ మీడియా వేదిక ద్వారా ఆడిష‌న్ నిర్వ‌హించ‌నుండ‌టం విశేషం. టాలీవుడ్‌కు ప్ర‌తిభావంతుల్ని ప‌రిచ‌యం చేసే ఈ అవ‌కాశాన్ని హ‌లో యాప్ చేజిక్కించుకుంది. హ‌లో యాప్‌లో అప్‌లోడ్ చేసిన అప్లికేష‌న్ల‌ను మాత్ర‌మే ఫైన‌ల్ ఆడిష‌న్ కోసం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని తేజ స్ప‌ష్టం చేశారు.సినిమా ఛాన్స్ కావాల..?ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్లు అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రెండు చిత్రాల్ని ద‌ర్శ‌కుడు తేజ అనౌన్స్ చేశారు. వాటిలో ఒక‌టి రానా ద‌గ్గుబాటితో తీసే ‘రాక్ష‌స‌రాజు రావ‌ణాసురుడు’ సినిమా కాగా, మ‌రొక‌టి గోపీచంద్‌తో రూపొందించ‌నున్న ‘అలిమేలుమంగ వేంక‌ట‌ర‌మ‌ణ’ చిత్రం. ఈ రెండింటిలో ఏ సినిమా కోసం ఈ ఆడిష‌న్స్‌ను నిర్వ‌హించ‌నున్నార‌నే విష‌యాన్ని త్వ‌ర‌లో వెల్ల‌డి చేస్తారు.