నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
వరంగల్ టైమ్స్, నాగర్ కర్నూల్ జిల్లా : చారకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తుర్కలపల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కననున్న దిమ్మెను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరంతా నేరేడుచర్లకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.