ఎంఎస్సీ నర్సింగ్, సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20న ఉదయం 7 గంటల నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం మెరిట్ జాబితాను యూనివర్సిటీ విడుదల చేయనున్నది. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.inలో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.