కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది

ఎస్సై షఫీ సస్పెండ్

వివాహితతో ఎస్ఐ రాసలీలలు
భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భర్త

కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది

వనపర్తి జిల్లాలో కీచక ఎస్ఐ బాగోతం బట్టబయలైంది. ఓ వివాహితను లొంగదీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే… వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న షేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ.. భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తున్నాడు.

స్థానికులు, స్నేహితుల సాయంతో ఈ విషయం తెలుసుకున్న భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి సమీపంలోనే కాపుకాశాడు. దీంతో ఆ మహిళ ఎస్‌ఐకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు.

ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆవేశంతో రగిలిపోయిన భర్త స్నేహితులతో కలిసి ఎస్ఐని విచక్షణా రహితంగా చితకబాదాడు. అడ్డొచ్చిన భార్యను కూడా చావబాదాడు.

తనను వదిలేయాలని ఎస్ఐ ప్రాధేయపడాలని వినిపించకుండా వారంతా చితకబాదడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐని కాపాడి వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అతడిని హైదరాబాద్‌కు తరలించారు.

అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐ‌ షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వక్రబుద్ది చూపిన ఖాకీకి తగిన శాస్తి జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.