మళ్లీ పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు 

మళ్లీ పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో మార్చి 22 తర్వాత ఇది పదోసారి. తాజా పెంపుతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 102.61కి, డీజిల్ ధర రూ.93.87కు చేరాయి.మళ్లీ పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు 

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ. 117.57, డీజిల్ ధర 101.79కి పెరిగాయి. మహానగరాలైన చెన్నైలో రెండింటిపై 76 పైసల చొప్పున పెరిగాయి. దీంతో పెట్రోల్ రూ.108.21, డీజిల్ రూ. 108.21గా ఉన్నాయి. కోల్ కతాలో పెట్రోల్ రూ. 112.19 ( 84 పైసలు), డీజిల్ రూ.97.02 ( 80 పైసలు )కు చేరాయి. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసల చొప్పున పెరిగాయి. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ రూ.116.32, డీజిల్ రూ.102.45 గా ఉన్నాయి.

గతకొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. అయితే వాహనదారులకు కొంత ఊరటనిచ్చిన కంపెనీలు, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన విషయం తెలిసింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 250 మేర పెంచాయి. దీంతో సిలిండర్ ధర రూ. 2,253 కు చేరింది. అయితే ఇండ్లల్లో వాడుకునే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ రేట్లను సవరించకపోవడం కొంతలో కొంత ఆనందించదగిన విషయమే.