‘కళాపోషకులు’ట్రైలర్​ విడుదల

“కళాపోషకులు” సినిమాను పూర్తిచేసి రిలీజ్ చేస్తున్న నిర్మాత సుధాకర్ రెడ్డి గట్స్ కి హ్యాట్సాప్-ట్రైలర్ లాంఛ్ లో హీరో సుమన్‘కళాపోషకులు’ట్రైలర్​ విడుదల

హైదరాబాద్​ : విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో, హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డిసెంబర్11న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. హీరో సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ‘కళాపోషకులు’ ట్రైలర్ లాంఛ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీ సముద్ర, నిర్మాత డీఎస్​రావు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ దీప ఉమాపతి, చిత్ర దర్శకుడు చలపతి పువ్వుల, సీనియర్ నటి కృష్ణవేణి, నటులు జ్వాల, చైతన్య, జబర్దస్త్ నవీన్, జెమిని సురేష్, బాష, చిన్ను, కెమెరామెన్ కళ్యాణ్ సమి, ఎడిటర్ సెల్వకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఎలేదర్ మహావీర్, పాల్గొనగా నిర్మాత సుధాకర్ రెడ్డి వారికి అహ్వానం పలికారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదల కానుంది. విశ్వకార్తికేయ, దీప ఉమాపతి జంటగా నటించిన ఈ చిత్రంలో భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్, చిట్టిబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: కళ్యాణ్ సమి,ఎడిటర్: సెల్వ కుమార్, సంగీతం: ఎలేందర్ మహావీర్, పీఆర్ఓ: సాయి సతీష్, నిర్మాత, స్టోరీ: సుధాకర్ రెడ్డి.ఎం. స్క్రీన్ ప్లే-డైలాగ్స్- డైరెక్షన్: చలపతి పువ్వల.