పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

ఓదెల రైల్వేస్టేషన్` నుంచి ‘స్ఫూర్తి’`గా పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌హైదరాబాద్​: శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో సూప‌ర్ హిట్ చిత్రాల నిర్మాత‌ కేకే రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `ఓదెల రైల్వేస్టేష‌న్`. మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్నఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన వ‌శిష్ట సింహ, హెబా ప‌టేల్, సాయిరోన‌క్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన విష‌యం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర‌లో హీరోయిన్ పూజిత పొన్నాడ న‌టిస్తోంది. తాజాగా ఓదెల రైల్వేస్టేష‌న్ నుంచి స్ఫూర్తిగా పూజిత పొన్నాడ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. మెడ‌లో పూల‌దండ‌, తాళితో పెళ్లికూతురుగా ఆహ్లాదంగా ఉన్న పూజిత పొన్నాడ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. `ఈ సినిమాలో `స్ఫూర్తి` అనే చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌ర్ చేశాను‌. క‌థ‌లో ఈ పాత్ర కీల‌కంగా ఉంటుంది. ఓదెల రైల్వేస్టేష‌న్ త‌ప్ప‌కుండా నా కెరీర్‌లో ఒక‌ మంచి సినిమా అవుతుంది. రాధామోహ‌న్ గారి `శ్రీ‌‌ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో, సంప‌త్ నంది స్క్రిప్ట్‌తో, అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నారు హీరోయిన్​ పూజిత పొన్నాడ. ‘ఈ చిత్రంలో ఒకస్ఫూర్తివంత‌మైన పాత్ర‌లో హీరోయిన్ పూజిత పొన్నాడ న‌టిస్తోంది. ఆమె లుక్ విడుద‌ల‌చేయ‌డం సంతోషంగా ఉంది. ఓదెల రైల్వేస్టేష‌న్ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో వాస్తవికతకు దగ్గరగా ఈ చిత్రం రూపొందుతోంది“ అని చెప్పారు చిత్ర నిర్మాత కే కే రాధా మోహన్​. ` పూజిత పొన్నాడ నటించిన ‘స్ఫూర్తి’ పాత్ర జీవితంలో మనందరికీ అవసరమైన ఒక బలమైన పాత్ర‌. పూజిత పొన్నాడ ను నిజ జీవితంలో ఇష్టపడినట్లుగానే ఓదెల రైల్వేస్టేష‌న్ లో స్ఫూర్తి పాత్ర‌ని ప్రేమిస్తారని ఆశిస్తున్నాను“ అన్నారు డైరెక్టర్​ సంపత్​నంది. వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

సాంకేతిక బృందం

సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
స‌మ‌ర్ఫ‌ణ‌: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్,
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది,
ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.