ఎమ్మెల్సీ కవిత ఓటుపై బీజేపీ ఫిర్యాదు

ఎమ్మెల్సీ కవిత ఓటుపై బీజేపీ ఫిర్యాదు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ ​: నిజామాబాద్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేసింది. గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ ఎన్నికల్లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారని ఫిర్యాదులో స్పష్టంచేసింది. అయితే కవితకు నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​లో ఓటుహక్కు ఉందని అక్కడి ఓటుతోనే ఆమె నిజామాబాద్​ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారని బీజేపీ నాయకులు ఆరోపించారు.ఎమ్మెల్సీ కవిత ఓటుపై బీజేపీ ఫిర్యాదుఅక్కడ ఓటు ఉండి హైదరాబాద్​లోని బంజారాహిల్స్​ చిరునామాతో మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒటుహక్కు ఓటు వేయడం ఏంటని వారు విమర్శించారు. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి ఎమ్మెల్సీ కవితను పదవి నుంచి డిస్​ క్వాలిఫై చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎస్ఈసీ తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోధన్​ లోని తన ఓటును హక్కును రద్దు చేసుకుందని వివరణ ఇచ్చింది.