కరోనా బారిన పడిన మంత్రి ఎర్రబెల్లి

కరోనా బారిన పడిన మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు. గత 3 రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి కోలుకునే వరకు ప్రజలెవరూ తనను కలిసేందుకు రావొద్దని కోరారు.

నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పీఏలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇటీవల రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వక హామీ కోసం తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం ఉన్నారు.

ఈ క్రమంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు 5 రోజులు ఢిల్లీలో పడిగాపులు కాశారు. నేడు ఒంట్లో నలతగా ఉండటంతో సాయంత్రం మంత్రి కరోనా పరీక్షలు చేయించుకోగా, కొవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో మంత్రి వెంటనే ఐసోలేషన్ కి వెళ్లారు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేసుకోవడంతో పాటు హోంక్వారంటైన్ లో ఉండాలని సూచించారు.