ఏపీలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
వరంగల్ టైమ్స్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.తెలంగాణలోనూ ఇదే తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.














