ఆ హత్య కేసులో సూత్రదారులెవరో తేలిపోయింది

ఆ హత్య కేసులో సూత్రదారులెవరో తేలిపోయింది

వరంగల్ టైమ్స్, అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సూత్రదారులెవరో తేలిపోయిందని, ఈ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నేడు పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వివేకా హత్యలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పూర్తిగా కూరుకుపోయారని, ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందని పేర్కొన్నారు. వివేకా హత్యను నాడు నాపై నెట్టి జగన్ రాజకీయంగా లబ్ధిపొందారని అన్నారు.ఆ హత్య కేసులో సూత్రదారులెవరో తేలిపోయిందిబాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పతనమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. హత్యను పాత్రదారులకే పరిమితం చేయకుండా సూత్రదారులను బోనులో నిలబెట్టాలని కోరారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల బాధలు కలిచివేస్తున్నాయని వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పేరుతో వంటనూనే ధరలను ప్రభుత్వం పెంచడం దుర్మార్గమని అన్నారు. రానున్న రోజుల్లో ఇవి మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.