ఒలింపిక్స్-2036కు సన్నద్ధమవుతున్నాం: మోదీ
వరంగల్ టైమ్స్,ఢిల్లీ: ఒలింపిక్స్-2036 క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రధాని ప్రారంభించారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు.గత దశాబ్ద కాలంలో భారత్లో 20కిపైగా అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించామని ప్రధాని గుర్తుచేశారు. అండర్-17 ఫిపా వరల్డ్కప్, హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్ లాంటి అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందన్నారు. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే జరగనున్నాయని తెలిపారు.














