కోహ్లీకి మంత్రి కేటీఆర్ కితాబు.. అదేంటంటే..

కోహ్లీకి మంత్రి కేటీఆర్ కితాబు.. అదేంటంటే..ముంబయి : టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటన ఫ్యాన్స్ కే కాదు, మొత్తం క్రీడాలోకానికే షాకిచ్చింది. ఈ నిర్ణయంపై చాలామంది వివిధ రకాలుగా స్పందించారు. ఈ జాబితాలో పలువురు రాజకీయ నేతలు కూడా ఉన్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేతల్లో ఒకరైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కోహ్లీ నిర్ణయంపై స్పందించారు. భారత సారధిగా ఏడేళ్లపాటు అద్భుతమైన నాయకత్వ ప్రతిభ కనబరిచావంటూ కోహ్లీని మెచ్చుకున్నారు.

“గత ఏడేళ్ల కాలంలో టీమిండియాకు నాయకత్వం వహించే బాధ్యతను అత్యద్భుతంగా నిర్వర్తించిన కోహ్లీకి కృతజ్ఞతలు. అమోఘమైన ప్యాషన్, నిబద్ధతతో ఆడుతూ టెర్రిఫిక్ లీడర్ గా నిలిచావు. టేక్ ఏ బో బ్రదర్ ” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సఫారీలతో న్యూలాండ్స్ మైదానం వేదికగా మూడో టెస్టు జరిగిన మరుసటి రోజే కోహ్లీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.