ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్న కమిషన్​

ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనున్న కమిషన్​హైదరాబాద్​ : జన అదాలత్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో డిసెంబర్ 16,17,18 తేదీలలో కమిషన్ పర్యటించనుంది. దళిత గిరిజనుల హక్కుల పరిరక్షణకై సత్వర న్యాయం జరిగే విధంగా కమిషన్ కోర్టును జిల్లాలోనే నిర్వహించి సమస్యలను అక్కడే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమంఉపయోగపడుతుంది . దళిత గిరిజనులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కుల సంఘాల ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషన్​ సూచించింది. కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని వారికి భరోసానిచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడిందని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో జన అదాలత్ పోస్టర్ ను కమిషన్ చైర్మన్, సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు.