రెండు రోజులు నీళ్లు బంద్

రెండు రోజులు నీళ్లు బంద్హైదరాబాద్: మహానగరంలో ఈనెల 16, 17 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాలకు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం.దానకిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లో తాగునీటి సరఫరాలో కీలకమైన కృష్ణా ఫేజ్-1 పంప్ హౌజ్ లో మరమ్మతుల దృష్ట్యా ఈ రెండ్రోజులు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కోదండాపూర్, నాసర్లపల్లి, గొడకండ్ల పంప్ హౌజ్ లో 600 ఎంఎం పైప్ లైన్ పై వాల్వులు అమర్చడం, 300 ఎంఎం డయా పైపులైన్ లీకేజీలను అరికట్టేందుకు ఈ మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. మిరాలం, కిషన్ బాగ్, బాల్ షెట్టికేత్, అల్ జుబేర్ కాలనీ, అలియాబాద్ , హషమాబాద్, రియాసత్ నగర్ , సంతోష్ నగర్ , వినయ్ నగర్ , సైదాబాద్, ఆస్మాన్ ఘడ్ , దిల్ షుక్ నగర్, చంచల్ గూడ, యాకుత్ పురం, మెహబూబ్ మాన్సన్, బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్ , హిందీనగర్, నారాయణ గూడ, అడిక్ మెట్ , శివం రోడ్ , చిలకల గూడ ప్రాంతాల్లో ఈ నెల 16న ఉదయం 5 గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి ఎండీ కోరారు.