ఫార్ములా ఈ కార్ రేస్‌లో కీలక పరిణామం

ఫార్ములా ఈ కార్ రేస్‌లో కీలక పరిణామం

-ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం
-ఛార్జ్‌షీట్‌కు దాఖలు చేసేందుకు సిద్ధమైన ఏసీబీఫార్ములా ఈ కార్ రేస్‌లో కీలక పరిణామంవరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించింది. ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్న ఏసీబీ, మరో వైపు ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో రాజకీయ, అధికారులపై ప్రాసిక్యేషన్ కు అనుమతి రావడంతో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. పార్ములా ఈ-కారు రేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇక ఫార్ములా ఈ-కారక రేసింగ్ వ్యవహారంపై 2024 డిసెంబర్ 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది.