రాష్ట్రంలో ఆరు టోల్‌ ప్లాజాలు బంద్‌ !

రాష్ట్రంలో ఆరు టోల్‌ ప్లాజాలు బంద్‌ !

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్క టోల్‌ ప్లాజాకే అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో చేసిన ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఆరు టోల్‌ ప్లాజాలు మూతపడనున్నాయి. తెలంగాణ రాష్ట్రం మీదుగా వెళుతున్న వివిధ జాతీయ రహదారుల్లో మొత్తం 28 టోల్‌ ప్లాజాలు ఉన్నాయి.రాష్ట్రంలో ఆరు టోల్‌ ప్లాజాలు బంద్‌ !

 

అయితే, కేంద్ర ప్రకటన నేపథ్యంలో వీటిలో బిక్‌నూర్‌ (ఎన్‌హెచ్‌ 7), చింతపల్లి(ఎన్‌హెచ్‌ 365), గజ్‌మల్‌ (ఎన్‌హెచ్‌14), ఇందల్‌వాయి (ఎన్‌హెచ్‌ 44), కడ్తాల్‌ (ఎన్‌హెచ్‌ 765), పిప్పల్‌వాడ (ఎన్‌హెచ్‌ 44), రాయికల్‌ (ఎన్‌హెచ్‌ 44) వద్ద ఉన్న టోల్‌ప్లాజాలు మూతపడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, కేంద్రం నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు వచ్చిన తర్వాతే ఏయే ప్లాజాలు మూతపడతాయనే అంశంపై స్పష్టత రానుంది.