స్కూళ్ల ప్రారంభంపై క్లారిటి

స్కూళ్ల ప్రారంభంపై క్లారిటిహైదరాబాద్ : తెలంగాణలో జనవరి 31 నుంచి స్కూళ్ల ప్రారంభం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా ప్రభావంతో జనవరి 30 వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ప్రస్తుతం ఆన్ లైన్ తరగతుల నిర్వహణ కొనసాగడం లేదు. దీంతో ఆన్ లైన్ క్లాసుల పై జర్నలిస్టులు మంత్రిని ప్రశ్నించారు. కొద్ది రోజుల సెలవులకు ఆన్ లైన్ క్లాసులు ఎందుకని ఆమె తిరిగి ప్రశ్నించారు. అదే విధంగా ఈ సారి పరీక్షల రద్దు, ప్రమోట్ చేయడం వంటివి ఉండవని ఆమె స్పష్టం చేశారు. అన్ని తరగతుల వారికి పరీక్షలు ఉంటాయని, అదే విధంగా జనవరి 31 నుంచి విద్యాసంస్థలు కొనసాగుతాయని ఆమె అన్నారు.