సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి గవర్నర్ : గవర్నర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం సీఎం కేసీఆర్ కి పుష్ప గుచ్చం పంపించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం త్వరగా కోలుకోవాలని, వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ పుష్పగుచ్చంతో పాటు సీఎంకి పంపిన లేఖలో పేర్కొన్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలతో సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారన్న విషయం తెలిసి ఆందోళనకు గురైనట్లు గవర్నర్ తన లేఖలో తెలిపారు.














