‘డి.ఎస్.జె’ టీజర్ విడుదల చేసిన ​వర్మ

'డి.ఎస్.జె' టీజర్ విడుదల చేసిన ​వర్మహైదరాబాద్ : ‘నేను గతంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఇప్పుడు నా దర్శకత్వంలో నా కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటించడం నాకు సంతోషం. నేను నా కూతురికి పాఠాలు నేర్పినట్లు ఉంది. అలాగే నా కుమారుడు నట్టి క్రాంతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మేము అడిగినవన్నీ మాకు సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో నా కొడుకు, కూతురు నిర్మాతగా, హీరోయిన్ గా వ్యవహరించడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ కోటి అబ్బాయి రోషన్ సాలూరి హీరో అద్భుతంగా నటించాడు. కరోనా సమయంలో కూడా మేము అడగ్గానే మా సినిమా చేసినందుకు రోషన్ సాలూరికి ధన్యవాదాలు’ అని తెలిపారు డైరెక్టర్​ నట్టికుమార్​.‘మా సినిమా డి.ఎస్.జె టీజర్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మకి ధన్యవాదాలు. కరోనా సమయంలో అందరూ బాగా సహకరించడం వల్ల షూటింగ్ ఈజీగా పూర్తయిందని ’తెలిపారు హీరోయిన్​ నట్టి కరుణ.‘నట్టికుమార్ సినిమాను బాగా తెరకెక్కించారు. అందరికి ఈ సినిమా నచ్చుతుంది. నట్టి కరుణ బాగా నటించింది, నటిగా తనకు మంచి భవిష్యత్​ ఉంటుంది. టీజర్ బాగుందని అందరూ అంటున్నారు. నట్టి క్రాంతి సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు ’అని తెలిపారు హీరో రోషన్.

నటీనటులు:
హీరో: రాజు సాలూరి
హీరోయిన్: నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్
హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: నట్టి కుమార్
నిర్మాత: నట్టి క్రాంతి
కెమెరామెన్: కోటేశ్వర రావు
సంగీతం: ఎస్.ఏ.కుద్దుస్
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: కెవి.రమణ
ఫైట్స్: కె.అంజిబాబు