ఓ కుటుంబం ఆత్మహత్య..పరారీలో ఎమ్మెల్యే కొడుకు

ఓ కుటుంబం ఆత్మహత్య..పరారీలో ఎమ్మెల్యే కొడుకుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాత పాల్వంచలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. రామకృష్ణ, శ్రీలక్ష్మి, వారి కుమార్తె సాహిత్య తమ ఇంట్లోనే అగ్నికి ఆహుతయ్యారు. మరో కుమార్తె సాహితి 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది.

రామకృష్ణ కారు నుంచి క్లూస్ టీం కొన్ని కీలక కాగితాలు, బిల్లులను స్వాధీనం చేసుకుంది. మొదట ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించిన పోలీసులు, ఆపై ఇది ఆత్మహత్యేనని ప్రాథమిక అంచనాకు వచ్చారు. గ్యాస్ లీకేజీ ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.

ఈ ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేందర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాఘవేందర్ ఆచూకీ తెలియలేదని, అతను పరారీలో ఉన్నాడని పాల్వంచ పోలీసులు పేర్కొన్నారు. కాగా గతంలో ఓ ఫైనాన్షియర్ ఆత్మహత్యకు కూడా రాఘవేందర్ కారకుడన్న ఆరోపణలు వచ్చాయి.