బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్

బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సీఎం కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన జీవో 317 కి వ్యతిరేకంగా ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జాగరణ దీక్షకు దిగారు. సంజయ్ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పోలీసులు అడ్డుచెప్పినా బండి సంజయ్ వెనక్కి తగ్గకుండా దీక్ష కొనసాగించారు. అక్కడికి కాషాయ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతుందనే అంచనాతో పోలీసులు బీజేపీ ఆఫీస్ తాళాలు పగులగొట్టీ బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు.

బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ లోనే సంజయ్ జాగరణ దీక్ష కొనసాగిస్తున్నారు. అరెస్ట్ కు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.