హైదరాబాద్ : బలమే జీవనం.. బలహీనతే మరణం అని జీవిత రహస్యాన్ని తెలియజేసి, భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి, యువతకు స్పూర్తి ప్రదాత స్వామి వివేకానందుడు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాలోని అసెంబ్లీ ఆవరణలో వివేకానంద చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు ప్రభుత్వ చీఫ్ విప్.
భారతదేశ యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారత్ కు సొంతమన్నారు దాస్యం వినయ్ భాస్కర్. అపారమైన మేథోసంపత్తి, శక్తి సామర్థ్యాలు కల్గిన యువత ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని భారత యువతకు దిశా నిర్దేశం చేసిన స్వామి వివేకానంద అడుగుజాడల్లో యువత నడవాల్సిన అవసరం ఉందని దాస్యం సూచించారు.














