బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతిహనుమకొండ జిల్లా : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బుధవారం బీజేపీ యువమోర్చ జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలో 1కే రన్ నిర్వహించారు. హనుమకొండ అంబేద్కర్ విగ్రహం నుంచి అదాలత్ లోని అమరవీరుల స్థూపం వరకు చేపట్టిన 1కే రన్ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ అంబేద్కర్ సెంటర్ నుంచి అదాలత్ లోని అమరవీరుల స్థూపం వరకు తీగల భరత్ గౌడ్ ఆధ్వర్యంలో రావు పద్మతో పాటు పలువురు బీజేపీ శ్రేణులు పరుగులు తీశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డా.విజయ రామారావు, బీజేపీ నాయకులు కొలను సంతోష్ రెడ్డి, రావుల కిషన్, కందగట్ల సత్యనారాయణ, గండ్రతి శ్రీనివాస్, డి. అమర్నాథ్ రెడ్డి, బైరి శ్రావణ్, గుజ్జుల మహేందర్ రెడ్డి, పిట్ట భరత్, శ్రీనివాస్, గొర్రె ఓంప్రకాష్, అనురాధ, కడేరు శ్రీనివాస్, కళ్యాణ్, నాయకులు కల్లూరి పవన్, తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు 7వ , 31వ డివిజన్లలో బీజేపీ నిర్వహించిన వివేకానంద జయంతి కార్యక్రమాల్లో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొన్నారు. వివేకానంద చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రావు పద్మ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు కొలను సంతోష్ రెడ్డి, గంద్రతీ శ్రీనివాస్, మట్టిపా వేణు, కళ్యాణ్, కడవెరు శ్రీనివాస్, నర్మెట్ట శ్రీనివాస్, రావుల సుదర్శన్, బండి సదానందం, మురళి, రాజు, జెండా రమేష్, నిఖిల్ చోప్రా, తదితరులు పాల్గొన్నారు.