ప్రజా ఉద్యమాలకు కేంద్రం తలవంచాల్సిందే : చల్లా

ప్రజా ఉద్యమాలకు కేంద్రం తలవంచాల్సిందే : చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పరకాల నియోజకవర్గ కేంద్రంలో రహదారులపై బైఠాయించి ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో భాగంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ప్రజా ఉద్యమాలకు కేంద్రం తలవంచాల్సిందే : చల్లాకేంద్ర ప్రభుత్వం జీడీపీ పెంచమంటే గ్యాస్, డీజిల్ ధరలు పెంచుతున్నదని ఎమ్మెల్యే చల్లా, ఎమ్మెల్సీ కడియం విమర్శించారు. చీటికి మాటికి ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. తమ వైఖరితో రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు. ప్రజా ఉద్యమాలకు మోడీ ప్రభుత్వం లొంగక తప్పదని హెచ్చరించారు. సుమారు కొన్ని గంటల పాటు సాగిన ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు నినాదాలు చేశారు.