కరోనా ఎఫెక్ట్ .. తాత్కాలిక హాస్పిటల్ నిర్మాణం 

కరోనా ఎఫెక్ట్ .. తాత్కాలిక హాస్పిటల్ నిర్మాణం

వరంగల్ టైమ్స్, చైనా : చైనాపై తాజాగా మరోసారి కరోనా తన పంజా విసిరింది. గత కొన్ని రోజుల నుంచి చైనాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో 2020 పరిస్థితిని ముందే ఊహించి, వెంటనే 6000 బెడ్స్ తో తాత్కాలిక ఆస్పత్రి నిర్మాణాన్ని చైనా ప్రభుత్వం ప్రారంభించింది. చైనాలోని జిలిన్ సిటీలో ఆస్పత్రి నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. కేవలం 6 రోజుల్లోనే 6000 బెడ్స్ తో ఈ హాస్పిటల్ ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం అయింది. జిలిన్ సిటీలో ఆస్పత్పి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.కరోనా ఎఫెక్ట్ .. తాత్కాలిక హాస్పిటల్ నిర్మాణం జిలిన్ ప్రావిన్స్ లోనే రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. చైనా వ్యాప్తంగా సోమవారం 2300 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం మాత్రం 3400 కేసులు బయటపడ్డాయి. కొవిడ్ 19 హాట్ స్పాట్స్ గా ఉండే ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. షాంగైలో స్కూల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి.