జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా పడింది.జేఈఈ మెయిన్ 2026 సెషన్–1 ఫలితాల విడుదల వాయిదా పడింది. తొలుత ఫిబ్రవరి 12న వెల్లడించాలని భావించిన ఫలితాలను ఇప్పుడు ఫిబ్రవరి 16న విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. జనవరి 21 నుంచి 29 వరకు జరిగిన ఈ పరీక్షలకు 13 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 4న తాత్కాలిక కీ విడుదల కాగా, అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీతో పాటు ఫలితాలు ప్రకటించనున్నారు. ర్యాంకులు సెషన్–2 తర్వాత వెల్లడిస్తారు.














