ఇంటెలిజెంట్ ఇడియట్ బుక్ ను ఆవిష్కరించిన ఆర్జీవీ

ఇంటెలిజెంట్ ఇడియట్ బుక్ ను ఆవిష్కరించిన ఆర్జీవీ

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ఎన్నో కష్టాలు పడి సినిమా పూర్తి చేసి థియేటర్ లో రిలీజ్ టైం వచ్చేటప్పటికి కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ స్క్రీనింగ్ చేయమని చెప్పడం బాదేసిందని రాంగోపాల్ వర్మ అన్నారు. అయితే నేను చెప్పేది ఒక్కటే..అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. సినిమా తీసే విషయంలోగాని, రిలీజ్ విషయంలో గానీ, నన్ను అడ్డుకోవడం బ్రహ్మతరం కూడా కాదు ఖబడ్దార్ అన్నారు ఆర్జీవీ. ఇంటెలిజెంట్ ఇడియట్ బుక్ ను ఆవిష్కరించిన ఆర్జీవీదర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం “మా ఇష్టం”.ఇందులో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్ట మొదటిసారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు-తమిళ -హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజరస్ ” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో “మా ఇష్టం” అని పేరు పెట్టారు.

ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మతో పాటు అప్సర రాణి, నైనా గంగూలీ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్య నారాయణలతో పాటు గెస్ట్ గా వచ్చిన హీరో త్రిగున్, హీరో ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత ప్రవీణ్ ఆర్జీవీ పై రాసిన “ఇంటెలిజెంట్ ఇడియట్” బుక్ ను ఆర్జీవీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ బుక్ లాంచ్ కార్యక్రమంలో ఆకెళ్ల రాఘవేంద్ర , వెంకట్ సిద్దారెడ్డి, విశ్వక్, వైజయంతి, విజయ లక్ష్మీ, బాల్ రెడ్డి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.