ఓవర్ స్పీడ్ అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..
రెండు వాహనాలు ఢీకొని ఒకరు మృతి..
ముగ్గురికి తీవ్ర గాయాలు..
వాహనంలోనే ఇరుక్కుపోయిన డెడ్ బాడీ క్షత గాత్రులు..
రెండు గంటలపాటు 20 మందితో ప్రయత్నం చేసిన …
డెడ్ బాడీనీ క్షతాగాత్రులను బయటికి తియ్యడానికి రాకపోవడంతో..
జెసిబి సహాయంతో తీసిన స్థానికులు పోలీసులు..
రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పరిధిలోని కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ గ్రామం వద్ద అర్ధరాత్రి 12 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది షాద్ నగర్ నుండి పరిగి వైపు వెళ్తున్న బొలెరా వాహనం పరిగి వైపు నుండి షాద్ నగర్ వస్తున్న టాటా ఏసీ వాహనం ఓవర్ స్పీడ్ తో ఒక దానికి మరొకటి ఢీకొనడంతో అక్కడికక్కడే వెంకటయ్య అనే వ్యక్తి స్పాట్లోనే మృతిచెందారు.
అయితే మృతి చెందిన వ్యక్తి చటన్ పల్లికి చెందిన వ్యక్తి గా చెబుతున్నారు. స్థానికులు పోలీసులతోపాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరు వాహనంలోనే ఇరుక్కుపోయారు. సుమారు రెండు గంటలపాటు 20 మంది ప్రయత్నం చేసిన వీరిని బయటకు తియ్యలేకపోయారు. దీంతో చివరికి జెసిబి సహాయంతో వీరిని బయటకు తీశారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.