భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు

భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ : ఏపీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించింది. కుండపోత వర్షాల కారణంగా ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నందలూరు-రాజంపేట మధ్య పట్టాలపై నీటి ప్రవాహం ప్రమాదకరంగా ఉంది.

రద్దు అయిన రైళ్ల వివరాలు..
చెన్నై సెంట్రల్- ముంబయి సీఎస్ టీ, గుంతకల్లు – రేణిగుంట
బిట్రగుంట – చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – బిట్రగుంట
విజయవాడ – చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – విజయవాడ
చెన్నై సెంట్రల్ – అహ్మదాబాద్, కాచిగూడ – చెంగల్పట్టు
ఎల్టీటీ ముంబయి – చెన్నై సెంట్రల్
ముంబయి సీఎస్టీ – నాగర్ సోల్, మధురై – ముంబయి ఎల్టీటీ
చెంగల్పట్టు – కాచిగూడ, చెన్నై సెంట్రల్ – ముంబయి ఎల్టీటీ

దారి మళ్లింపు అయిన రైళ్ల వివరాలు..
తిరువనంతపురం – షాలిమార్, ముంబయి సీఎస్టీ – చెన్నై సెంట్రల్
తిరుపతి – నిజాముద్దీన్, కాచిగూడ – మంగళూరు
బెంగళూరు – గువాహటి, చెన్నై సెంట్రల్ – నిజాముద్దీన్
చెన్నై సెంట్రల్ – హావ్ డా, చెన్నై సెంట్రల్ – విజయవాడ