విజయ్ దేవరకొండ-రష్మికకి ప్రధాని మోడీ విషెష్

నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో విజయ్, రష్మిక వివాహం సందర్భంగా కాబోయే వధూవరులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జంటకు ప్రధాని మోడీ కార్యాలయం నుంచి శుభాకాంక్షలు అందాయి. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందించిన మోడీ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు. “సప్తపది స్ఫూర్తితో ఏడడుగులు వేస్తోన్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నా.. రానున్న కాలమంతా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అని ప్రధాని మోడీ దీవించారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు కూడా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ జంట ఫిబ్రవరి 26న ఏడడుగులు వేయనుంది. సుమారు 100 మంది అతిముఖ్యమైన అతిథులతో ఈ వివాహం జరుగుతుంది. వివాహం అనంతరం మార్చి4న హైదరాబాద్ లో వివాహ విందు వేడుకని నిర్వహించనున్నారు













