హైదరాబాద్: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీమిండియాకు టీ20 వరల్డ్‌కప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ను అందించన మాజీ సారథి అకస్మాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోనీ రిటైర్మెంట్‌పై కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది. ఇక ధోనీ ఆడడు అని ఇటీవలే గంభీర ఓ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇవాళ కాసేపటి క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. ఇన్నాళ్లూ మీరు చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యావాదాలు అంటూ తెలుపుతూనే.. రాత్రి 7 గంటల 29 నిమిషాల నుంచి రిటైర్ అయినట్లుగా భావించాలని తన కామెంట్‌లో పోస్టు చేశాడు. తన రిటైర్మెంట్‌ను ధోనీ తనదైన స్టయిల్‌లోనే చెప్పాడు.