ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా క్రికెట్‌కు గుడ్‌బై

ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా క్రికెట్‌కు గుడ్‌బైముంబై: అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్‌ ధోనీ వీడ్కోలు పలికిన నిమిషాల్లోనే మరో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఐపీఎల్‌లో ధోనీ-రైనా జోడీ పదేళ్ల నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున ఆడుతున్నారు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌-13లో పాల్గొనేందుకు చెన్నై ఫ్రాంఛైజీ ఆటగాళ్లందరూ చెన్నైలోనే ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ఉన్నారు. 2005 జూలైలో శ్రీలంకపై రైనా తొలి వన్డే ఆడాడు. 2010 జూలైలో లంకపైనే తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. తన కెరీర్‌లో 19 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో రైనా రాణించలేకపోయాడు. 2018 జూలై17న ఇంగ్లాండ్‌తో వన్డేలో ఆఖరి మ్యాచ్‌ ఆడాడు.