ఉద్దానం… ఇక జబ్బు మాయం

ఉద్దానం కిడ్నీ బాధితులు ఎక్కడ చూసిన ఇదే చర్చ.. కానీ పరిష్కారం మాత్రం లభించలేదు. రాజకీయ నాయకులు ఇది ఎన్నికల అజెండాగా మార్చడం… తర్వాత పట్టించుకోకపోవడం సాధారణంగా మారిపోయింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొంత ప్రయత్నం జరిగినా ఆయన మరణిండంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో వున్నా తాత్కాలిక చర్యలు మాత్రమే తీసుకొన్నారు. కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో కిడ్నీ బాధితుల సమస్యలను స్వయంగా తెలుసుకొని చలించి పోయారు. ఉద్దానం ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఓ బాధితుడు కిడ్నీ సమస్యతో బాధపడుతూ కనీసం డయాలసిస్ చేయించుకోలేని దుస్థితిలో ప్రతినెలా పదుల సంఖ్యలో చనిపోతున్నారు.

ఉద్దానం... ఇక జబ్బు మాయం 809 గ్రామాల్లో శాశ్వత త్రాగునీటి పథకం..

శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, వజ్రపుకొత్తూరు, మందస ప్రాంతాలలోని దాదాపు 809 గ్రామాల్లో 5.74 లక్షల నివసిస్తున్నారు. వీరు తాగునీటి కోసం ఎక్కువగా బోరుబావుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. భూగర్భ జలాలు విషపూరితమై కిడ్నీ వ్యాధులు ప్రబలే కారకాలు ఎక్కువగా వున్నాయని నిపుణులు తేల్చారు. కిడ్నీ బాధితులు ఎక్కువగా వున్నారు. తాగునీటి అవసరాల కోసం దగ్గరలోనే వున్న బహుదా, మహేంద్ర నదులు వున్నా ఎండకాలంలో పూర్తిగా ఎండిపోతుండడం వలన బోర్ల మీదనే ఆధారపడి వుండే పరిస్థితి నెలకొంది.

రిజర్వాయర్ నుంచి పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరా…

ఉద్దానానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీరమండలం రిజర్వాయర్‌ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేస్తారు. అలా శుద్ది చేసిన నీటిని ఉద్దానం ప్రాంతంలో వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు తరలిస్తారు . ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు.
ఉద్దానం... ఇక జబ్బు మాయం
527 కోట్లతో శాశ్వత తాగునీటి పథకం…

700 కోట్ల రుపాయల అంచనాలతో ఈ పధకాన్ని డిజైన్ చేసి రూ 530 కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ లో రూ 527 కోట్లతో ఆ పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టరు సంసిద్దత వ్యక్తం చేశారు. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ… కాంట్రాక్టు సంస్థ తో ఒప్పందం అనంతరం ఈ పనులు ప్రారంభం కానున్నాయి. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు.

35 సంవత్సరాల క్రితమే కిడ్నీ వ్యాధి…

ఉద్దానం లో కిడ్నీ సమస్య 35 సంవత్సరాల క్రితం బైట పడింది. అపుడు ఇక్కడి ప్రజలు ఎక్కువగా కిడ్నీ వ్యాధిని నయం చేయించుకునేందుకు సుదూర ప్రాంతాలైన చెన్నై ,విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి నగరాలకి వెళ్ళాల్సి వచ్చేది. అయితే కాలక్రమంలో సమస్య మరింత తీవ్రంగా మారింది. స్థానికంగా ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. అయినా పాలకులు సమస్యను పట్టించుకోలేదు. రోజు రోజుకు కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పాలకులు తాత్కాలిక ఉపశమ చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. అవి కొద్దీ రోజులు నడిచి ఆ తరువాత నిలిచి పోయాయి. 2004లో ఎన్నికల్లో వై ఎస్ రాజశేఖర రెడ్డి విజయం సాధించిన తరువాత స్థానిక నేతలు ఉద్దానం కిడ్నీ సమస్య తీవ్రతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఒక సమగ్ర ప్రణాలికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అది ఒక కొలిక్కి వచ్చే సమయానికి మరణించారు. 2014 లో తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది. అపుడు కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రాబాబు నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు రాలేదు. చంద్ర బాబు మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2017లో ఉద్దానం ప్రాంతాన్ని సందర్శించారు. 2018 మే లో ఎచ్చెర్ల లో దీక్ష చేశారు ఆ తరువాత ముఖ్య మంత్రి చంద్ర బాబును హార్వార్డ్ విశ్వ విద్యాలయ బృందం తో కలిశారు. సమస్య తీవ్రతను ఆయన ముందుంచారు. అయినా ఉద్దానం ప్రజల సమస్య మాత్రం తీరలేదు. హార్వార్డ్ విశ్వవిద్యాలయ బృందం స్థానికంగా సమస్యను అధ్యయనం చేసింది. పరిష్కార మార్గం చూపలేదు. 2017 జనవరి లో అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి , ప్రస్తుత బి జె పీ అధ్యక్షుడు జె పీ నడ్డా విశాఖ పట్నం లో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ సమస్య పై అధ్యయనానికి నిపుణుల బృందాన్ని పంపుతాన ని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ జి ఆర్ ఐ, బాబా అణు పరిశోధనా కేంద్రం, ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఐ సి ఎం ఆర్, పలు ప్రైవేట్ సంస్థలు ఉద్దానం సమస్య పై అధ్యనం చేసాయి. అయితే సమస్యకు మూల కారణం మాత్రం కనుక్కోలేక పోయాయి. కొన్ని విదేశీ విశ్వ విద్యాలయాలు కూడా సమస్య పై ద్రుష్టి సారించినా నిధుల కొరత వల్ల మధ్యలోనే ఆపేసాయి. ఈ సంస్థలు స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు, బంధుత్వాలు, మద్యం సేవించటం , పొగ తాగటం వంటి వాటి పై అధ్యయనం చేసాయి. అయితే అవి ఏవీ ఇద మిద్దమైన కారణాన్ని తేల్చలేక పోయాయి. చంద్రబాబు స్థానికంగా ఆర్ ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం అవి అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. చంద్రబాబు కేంద్ర పరిశోధన సంస్థ ఐ సి ఎం ఆర్, జార్జ్ ఇనిస్ట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సంస్థలతో ఉద్దానం కిడ్నీ సమస్య పై పూర్తి స్థాయి అధ్యయనం చేయిస్తానని అన్నా అది మధ్యలోనే ఆగి పోయింది.

ఉద్దానం కాదు ఉద్యానవనం…

చుట్టూ పచ్చదనం, కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రకరకాల పళ్ళ తోటలతో కలకలలాడు తుండేది. అందుకే ఉద్యానవనంగా పేరు గాంచింది. కాలక్రమేణా అది కాస్తా ఉద్దానం గా మారింది.

ఉద్దానం... ఇక జబ్బు మాయం

ప్రపంచంలో నాలుగో కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతంగా ఉద్దానం…
ప్రపంచంలో నికరాగువా, కోస్టారిక, శ్రీలంక, నాల్గవది ఉద్దానం..

కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధితో వేలాది మంది సతమత మవుతున్నారు. సరైన డయాలసిస్ చేయించుకొనే ఆర్థిక స్థోమత లేక ఎందరో ప్రాణాలు కోల్పోయారు. త్రాగునీటి సమస్య వల్లనే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని గుర్తించి శాశ్వత తాగునీటిపరిష్కారం, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం లో భాగంగా పరిశోధన కేంద్రం ఏర్పాటుకు 50 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేసారు.

గత ప్రభుత్వ హయాంలో 17 మొబైల్ కేంద్రాల ద్వారా ఉద్దానం విస్తరించి ఉన్న పలు ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి గ్రస్తులను గుర్తించేందుకు పరీక్షలు చేశారు. 107 గ్రామాల్లో 1. 3 లక్షల జనాభాను పరీక్షిస్తే 14 వేల మంది కిడ్నీ బాధితులు తేలారు. కవిటి మండలం లో కిడ్నీ బాధితుల సంఖ్యా ఎక్కువగా ఉంది. ఉద్దానం లో కిడ్నీ సమస్య వెలుగు లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 10 వేల మంది మరణించి ఉంటారని ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వారి అంచనా. ఉద్దానం పరిధి లోని ప్రతి గ్రామం లో రెండు రోజులకు ఒకరు కిడ్నీ సమస్య తో మరణిస్తుంటారు