‘నా దారి నాదే’ లిరికల్ అవుట్

'నా దారి నాదే' లిరికల్ అవుట్

హైదరాబాద్​: చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శివ ఏటూరి దర్శకత్వంలో కరణం శ్రీనివాసరావు నిర్మిస్తున్న “1/2-వన్ బై టు” సినిమాలోని ‘నాదారి నాదే’ అనే లిరికల్ సాంగ్ ని గురువారం ప్రముఖ కొరియోగ్రాఫర్ “శోభి మాస్టర్” విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది, DSK స్క్రీన్స్ అధినేత డీఎస్​ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జానకిరామ్ పామరాజు, డైరెక్టర్ శివ ఏటూరి పాల్గొన్నారు. ‘వీడియో సాంగ్ చూసాను, కొరియెగ్రాఫర్ కపిల్ చాలా బాగా కంపోజ్ చేశారు, హీరోయిన్ శ్రీపల్లవి డాన్స్ చాలా ఎనర్జిటిక్ అండ్​ స్టైలిష్ గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు శోభి మాస్టర్. ‘సంపత్ నంది చిత్ర బృందాన్ని అభినందించారు. కొత్త కాన్సెప్టుతో వచ్చే ఇలాంటి సినిమాలు పరిశ్రమకి అవసరం, వీటిని ప్రోత్సహించాలన్నారు’ డీఎస్​రావు. ‘డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నిర్మాత కరణం శ్రీనివాసరావు ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు అన్నారు దర్శకుడు శివ. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జానకిరామ్ పామరాజు, డైలాగ్స్: విజయభారతి, కెమెరా: శంకర్ కేసరి, సంగీతం: లియాండర్ లీమార్టీ మరియు ఆదేశ్ రవి, ఎడిటింగ్: జె.పి, డాన్స్: కపిల్, ఫైట్స్ : శంకర్