ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు

ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు

హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో సీట్ల భర్తీకి చేపట్టిన ఎడ్ సెట్ 2020 కౌన్సిలింగ్ కొనసాగుతున్నది. ఈనెల 10న కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 13044 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఈ నెల 25 వరకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లకు, సర్టిఫికెట్ల అప్ లోడ్ కోసం గడువు పొడగించారు. ఈనెల 14న ప్రారంభైన ఎన్సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పరిశీలన డిసెంబర్ 17వరకు వుంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 27న కౌన్సిలింగ్ కు అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఎడ్ సెట్ కు ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయడానికి , వాటిని పరిశీలించే గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. వెబ్ కౌన్సిలింగ్ ఈనెల 28, 29 తేదీల్లో, ఎడిట్ ఆప్షన్ ఈ నెల 30న ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారి జాబితాను జనవరి 3న ప్రకటిస్తామని, జనవరి 4 నుంచి 8 వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయవచ్చని అన్నారు. రాష్ట్రంలోని 199 బీఈడీ కాలేజీల్లో 13వేల200 సీట్లు వున్నాయి. జనవరి 11 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కేయూ, ఇతర యూనివర్సిటీలు డిగ్రీ ఫలితాలను విడుదల చేయాల్సి వున్న నేపథ్యంలో అన్ని సంవత్సాలు, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు వస్తేనే ప్రొవిజినల్ సర్టిఫికెట్ ఇస్తారు. ఇందులో భాగంగానే గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు.