విజయవాడలో హీరో సాయి ​ధరమ్​తేజ్​ సందడి

విజయవాడలో హీరో సాయి ​ధరమ్​తేజ్​ సందడి

విజయవాడ : విజయవాడలో సినీ హీరో సాయి ​ధరమ్​తేజ్ గురువారం​ సందడి చేశారు. షూటింగ్​ నిమిత్తం వచ్చిన ఆయన పట్టణంలోని వాంబేకాలనీలోని అమ్మప్రేమ ఆదరణ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు వృద్ధాశ్రమానికి సాయం చేయమని కోరగా స్పందించిన హీరో ఆరులక్షల విరాళం అందించాడు. అంతేగాకుండా తన స్నేహితుల సాయాన్ని కూడా అందించినట్లు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో అభిమానుల సహకారంతో మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కరోనా అన్​లాక్​ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సినిమాహాళ్లకు అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. త్వరలోనే తాను నటించిన సినిమా ‘సోలోబతుకే సోబెటర్’ సినిమా విడుదల కానుందని చెప్పారు. పైరసీని తరమికొట్టి సినిమాహాళ్లలో సినిమా చూసి ఆదరించాలని ఆయన అభిమానులను కోరారు.​