మొదలైన పీజీఈసెట్ రెండవ కౌన్సెలింగ్‌

మొదలైన పీజీఈసెట్ రెండవ కౌన్సెలింగ్‌
హైదరాబాద్: నేటి నుంచి పీజీఈసెట్ రెండో విడుత కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కళాశాలల్లో సీట్ల భర్తీకి నేటి నుంచి ఈనెల 23 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ఆన్లైన్ పేమెంట్, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ వుండగా, 26న కౌన్సిలింగ్ కు అర్హుల జాబితా వెల్లడిస్తారు. ఈ నెల 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. 28 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో వుంటుంది. ఈనెల 30న సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తారు. ఈనెల 31 నుంచి జనవరి 6 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కాలేజీల్లో రిపోర్ట్, ఫీజు చెల్లించాల్సి వుంటుంది. రెండో విడుత పీజీఈసెట్ కౌన్సిలింగ్ లో 4,413 సీట్లు అందుబాటులో ఉన్నాయి.